వికారాబాద్ అడ‌వుల్లో స్టార్ హీరోయిన్‌!

-

వికారాబాద్ అడ‌వుల్లో స్టార్ హీరోయిన్ సంద‌డి చేస్తోంది. ఎల్లో క‌ల‌ర్ లెహెంగా .. దానిపై ర‌క‌ర‌కాల పూలు.. బ్లాక్ క‌ల‌ర్ చున్నీ ధ‌రించి హంగామా చేస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ హీరోయిన్‌? ఏమాక‌థ అని ఆరాతీస్తే ఆ స్టార్ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు ర‌కుల్ ప్రీత్‌సింగ్ అని తేలింది. సుశాంత్‌సింగ్ రాజ్ పుత్ అనుమ‌నాస్ప‌ద మృతి త‌రువాత రియాకు డ్ర‌గ్స్‌తో లింకులున్నాయ‌ని తేల‌డం.. ఎన్‌సీబీ అధికారుల విచార‌ణ‌లో ర‌కుల్‌తో పాటు మ‌రో హీరోయిన్ సారా అలీఖాన్ పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయంటూ ప్ర‌చారం జ‌రిగింది.

జాతీయ మీడియాలో వ‌రుస‌గా వీరిపై ప‌లు సంచ‌ల‌న క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. దీనిపై ఆగ్ర‌హించిన ర‌కుల్ ఢిల్లీ హైకోర్టులో మీడియా క‌థ‌నాల‌పై స్టేవిధించాలని ఫ‌ర్యాదు చేసింది. దీంతో మీడియాపై నియంత్ర‌ణ అవ‌స‌ర‌మ‌ని స‌ద‌రు కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఆ త‌రువాత ర‌కుల్ కేసు  ఏమైంది? ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అనే చ‌ర్చ జ‌రిగింది. ఇంత జ‌రుగుతున్నా ర‌కుల్ సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతోంది.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో కొండ పొలం న‌వ‌ల ఆధారంగా ఓ మూవీ రూపొందుతోంది. సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్నాడు. జాగ‌ర్ల‌మూడి సాయిబాబా, వై. రాజీవ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప‌ల్లెటూరి యువ‌తిగా ర‌కుల్ క‌నిన‌పించ‌బోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘాట్టాల‌ర‌ని ప్ర‌స్తుతం వికారాబాద్ అడ‌వుల్లో షూట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌కుల్‌కు సంబంధించిన ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇవి వైర‌ల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news