రకుల్ ప్రీత్ సింగ్.. చిత్ర పరిశ్రమకు వచ్చి చాలా సంవత్సరాలు అయినా.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది ఈ ఢిల్లీ సుందరి. తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రకుల్ కు. ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గానూ వెలుగొందింది టాలీవుడ్ ఇండస్ట్రీలో.
అయితే.. తనకు వచ్చిన ఈ సక్సెస్ పూల పాన్పు మీద నడకేం కాదు. ఫిట్ నెస్ పై రకుల్ చాలా శ్రద్ధ తీసుకుంటుంది. రోజులో ఎక్కువ సమయాన్ని రకుల్ ఫిట్ నెస్ కోసమే కేటాయిస్తుంది. తనకు హైదరాబాద్ లో ఎఫ్ 45 అనే జిమ్ కూడా ఉంది. అయితే.. రీసెంట్ గా జిమ్ లో తను చేస్తున్న వర్కవుట్స్ ను రకుల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. రోజూ ఉదయం ఇలా ప్రారంభమైతే దాంట్లో ఉండే కిక్కే వేరని మీకు తెలుసా అంటూ క్యాప్సన్ కూడా పెట్టింది. మొత్తానికి ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. రకుల్ జిమ్ వర్కవుట్స్ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.