రంగస్థలం కాంబో రిపీట్.. సుకుమార్ తో రామ్చరణ్ మరో మూవీ

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఓవైపు గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చెర్రీ.. మరోవైపు బుచ్చిబాబు సినిమా కోసం కూడా పనిచేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పట్టాలెక్కుతుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కోసం చరణ్ తన కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్తో కలిసి పని చేయనున్నాడు.

రంగస్థలంతో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్న రామ్‌చరణ్‌ – సుకుమార్‌ల కాంబినేషన్‌ మరోసారి వర్కవుట్ అయింది. అంతా అనుకున్నట్లుగానే ఇది చరణ్‌ 17వ సినిమాగా పట్టాలెక్కనుంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ‘రంగస్థలం’ సినిమా తర్వాత ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ ఏడాదిలోనే షూటింగ్ షురూ చేయనుండగా వచ్చే ఏడాది ఆఖర్లో సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప 2’ షూటింగ్ పూర్తి కాగానే దీన్ని ప్రారంభించనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news