చరణ్ మూవీ ఆ డేట్ ఫిక్స్ అవ్వొచ్చా..!

-

రంగస్థలం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందట. కేవలం 2 సాంగ్స్, 10 రోజుల టాకీ షూటింగ్ చేయాల్సి ఉందట. నవంబర్ ఎండింగ్ కల్లా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా సినిమాకు ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియరా అద్వాని నటిస్తుంది.

ఈ సినిమా ముందు నుండి అనుకున్నట్టుగానే జనవరి 11న సంక్రాంతి బరిలో దిగుతుంది. జనవరి 9న ఆల్రెడీ ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఎన్.టి.ఆర్ బయోపిక్ కు సంబందించిన ప్రమోషన్స్ మొదలుపెట్టారు. చరణ్ సినిమా ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. దసరాకి టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని ఆశించినా రాలేదు. వినయ విధేయ రామా అన్న టైటిల్ ప్రచారంలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి మాత్రం సినిమాకు ఆ టైటిల్ వద్దని చెప్పాడట.

Read more RELATED
Recommended to you

Latest news