బాహుబలి తర్వార రాజమౌళి చేయబోతున్న మెగా నందమూరి మల్టీస్టరర్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఎన్.టి.ఆర్, చరణ్ లతో రాజమౌళి పెద్ద సాహసమే చేయబోతున్నాడు. డిసెంబర్ లో మొదలవనున్న ఈ సినిమా షూటింగ్ లో మొదట ఎన్.టి.ఆర్ పాల్గొంటాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ కోసం హాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ను రప్పించాడట జక్కన్న.
జై లవ కుశ తర్వాత ఎన్.టి.ఆర్ అతని వర్క్ అవుట్స్ తోనే సిక్స్ ప్యాక్ చేశాడు. ఇక రాజమౌళి మాత్రం ఎన్.టి.ఆర్ ను పూర్తిస్థాయి మేకోవర్ చూపించే ప్రయత్నాల్లో ఉన్నాడట. ఈ వర్క్ షాప్ నడుస్తూనే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమాలో పాత్రకు తగినట్టుగా ఎన్.టి.ఆర్ లుక్ వచ్చేలా స్టీవెన్స్ ట్రైనింగ్ ఇస్తాడట. ఎన్.టి.ఆర్ తర్వాత చరణ్ కు ఇతను ట్రైనింగ్ ఇస్తాడని తెలుస్తుంది.