గాడ్ ఫాదర్ కు 150 కోట్లు వచ్చాయి – చరణ్

చిరంజీవి హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం అయితే ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయ్యి చిరు కెరీర్ లో మంచి హిట్ అండ్ ఆచార్య నుంచి కం బ్యాక్ గా నిలిచింది.

మరి ఈ సినిమాకి నిర్మాణంలో పనిచేసిన మరో నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ ఫైనల్ వసూళ్లపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ చిత్రం రెండు భాషల్లో రిలీజ్ అయినప్పటికీ గాడ్ ఫాదర్ ని రిలీజ్ చేయగా దీనికి దాదాపు 145 నుంచి 150 కోట్లు గ్రాస్ వచ్చింది అని కన్ఫర్మ్ చేశాడు. దీనితో గాడ్ ఫాదర్ అసలు వసూలు కోసం చూస్తున్న వారికి స్వయంగా చరణ్ నుంచే సమాధానం దొరికిందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో సత్యదేవ్, నయన్ తదితరులు నటించగా థమన్ సంగీతం అందించారు.