వినయ విధేయ రామ సెన్సార్ రివ్యూ..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా సెన్సార్ కార్యమాలను ఈరోజు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. బోయపాటి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉందని తెలుస్తుంది.

రాం చరణ్ డైలాగ్స్ తో పాటుగా యాక్షన్ కూడా ఇరగదీశాడని తెలుస్తుంది. కియరా అద్వాని అందాలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కాగా దేవి మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యిందట. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న వినయ విధేయ రామ సినిమా మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.

విలన్ గా వివేక్ ఓబేరాయ్ కూడా బాగా చేశాడట. హీరో, విలన్ ల మధ్య ఫైట్ అదిరిపోతుందట. కొణిదెల రాం చేసే విధ్వంశానికి రికార్డులు అన్ని తిరగరాయడం కన్ ఫాం అనేస్తున్నారు మెగా ఫ్యాన్స్. జనవరి 11న వస్తున్న సినిమా ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news