వాళ్లే..అన్నయ్యను బలహీనపర్చారు..పవన్

-

అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి కీలక పాత్ర పోషించన వారిలో తాను ఒకడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ…సామాన్యులకు సేవ చేయాలనే తపన, సామాజిక న్యాయం కోసం నాడు అన్నయ్య పార్టీని స్థాపిస్తే.. కొంత మంది స్వార్థ పూరిత నాయకుల కారణంగా ఆయన ఆశయాలు నిరుగారాయన్నారు. నాడు ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారని వివరించారు.

అందుకే జనసేన పార్టీ నిర్మాణంలో గత అనుభవాలను నెమరువేసుకుంటూ… పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.  రాష్ట్రంలోని యువత తోడ్పాటుతోనే పార్టీని పెట్టానన్నారు. జనసేన పార్టీ పెట్టిన‌ప్పుడు పెద్ద నాయ‌కులు ఎవ‌రూ లేరని, యువ‌త‌ను న‌మ్మి పార్టీ పెట్టాన్నారు. వారే జనసేనకు వెన్నెముక‌గా తెలిపారు. ప్రస్తుత పార్టీలు రాజకీయాల్లో విజయం కోసం కనీసం రెండు వేల కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..కానీ  అలాంటి రాజకీయాలను మార్చేందుకు, ప్రజా బలంతో ఎన్నికల్లో పోటీచేయనున్నాం. కనీసం అర్హులకు తెల్ల రేషన్ కార్డు కూడా ఇప్పంచలేని స్థితిలో స్థానిక నేతలున్నారని ఆయన ఆరోపించారు. గత అనుభవాలను పాఠాలుగా మల్చుకుని అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని వారికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news