చరణ్ ఫస్ట్ లుక్ పై అసలు సీక్రెట్ ఇదే..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దీవాళి కానుకగా రిలీజ్ చేశారు. వినయ విధేయ రామ ఫస్ట్ లుక్ తో మాస్ లుక్ లో చరణ్ అదరగొట్టాడు. అయితే అసలు ఫస్ట్ లుక్ లో వచ్చిన పోస్టర్ చరణ్ కనిపించి కనిపించకుండా ఉన్నాడు.

అయితే లేటెస్ట్ గా చరణ్ కు సంబందించిన ఈ ఫస్ట్ లుక్ ఇది కాదని తెలుస్తుంది. ముందే ఈ ఫస్ట్ లుక్ పై వచ్చిన వార్తల ప్రకారం పంచెకట్టుతో చరణ్ కనిపించే ఫస్ట్ లుక్ డిజైన్ చేశారట. అయితే మెగా ఫ్యాన్స్ కు అది కిక్ ఇస్తుందో లేదో అని బోయపాటి శ్రీను లాస్ట్ మినిట్ లో ఈ ఫస్ట్ లుక్ నిర్ణయించాడట. టైటిల్ కు ఫస్ట్ లుక్ కు అసలు సంబంధం లేకున్నా చరణ్ లుక్ మెగా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. రేపు రాబోతున్న టీజర్ లో బోయపాటి మార్క్ ఏంటో తెలియచేస్తాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news