వివిఆర్ ట్రైలర్ ను లాంచ్‌ చేసిన కేటీఆర్‌

-

బోయపాటి శ్రీను, రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ వినయ విధేయ రామ. సాఫ్ట్ టైటిల్ తో వచ్చారు ఎలాంటి సినిమా చేస్తారో అనుకున్నారు కాని కొద్ది నిమిషాల క్రితం రిలీజైన ట్రైలర్ చూస్తే ఇది బోయపాటి బొమ్మే అని విజిల్స్ వేసి మరి చెప్పేలా ఉంది. సరైన సింహం తగలనంతవరకు ప్రతి వేటగాడు మగాడే అంటూ మొదలు పెట్టిన చరణ్.. నాకు నీలా సైన్యం లేదు.. ఒంట్లో బెరుకు లేదు.. చావంటే భయం లేదు అంటూ అదరగొట్టాడు.

ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి చెర్రి లోని మాస్ యాంగిల్ ను పూర్తిగా బయటపెట్టాడని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే మెగా ఫ్యాన్స్ కే కాదు సిని అభిమానులకు గూస్ బమ్స్ అయ్యేలా చేసింది. దేవి మ్యూజిక్ అదనపు ఆకర్షణగా ఉండేలా ఉన్న ఈ సినిమా పక్కా హిట్ అనేలా ఈ ట్రైలర్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news