
చోలె కుల్చె… నార్త్ ఇండియా స్పెషల్ డిష్ ఇది. స్ట్రీట్ ఫుడ్. ఢిల్లీ వాసులైతే ఈ వంటకాన్ని లొట్టలేసుకుంటూ తింటారు. దాన్ని చూస్తేనే నోరు ఊరుతుంది. ఎలాగైనా తినాలి అని అనిపిస్తుంది. దాన్ని అక్కడే వండి వేడి వేడిగా వడ్డిస్తారు. ఇప్పుడు ఈ చోలె కుల్చె ఎందుకు గుర్తొచ్చిందంటారా?
చోలె కుల్చె తయారు చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకే.. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దాన్ని ఎప్పుడూ తినకపోతే.. కనీసం దాన్ని ఎలా తయారు చేస్తారో.. దానికి ఎంత డిమాండ్ ఉందో ఈ వీడియోలో చూడండి.