ఫ్లాప్ చిత్రానికి వంద మిలియన్లు.. హిందీలో రామ్ హవా.

తెలుగు సినిమాలకి మార్కెట్ చాలా పెరిగింది. తెలుగేతర రాష్ట్రాల్లో కుడా తెలుగు సినిమాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదీగాక హిందీలో అనువాదం అవుతున్న తెలుగు సినిమాలకి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలకే కాదు, తెలుగులో అస్సలు ఆడని చిత్రాలు కూడా హిందీలో మంచి ఆదరణ దక్కించుకుంటాయి. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన గణేష్ చిత్రం యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.

కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. 2009లో రిలీజైన ఈ చిత్రానికి హిందీలో వంద మిలియన్ల వ్యూస్ రావడం ఆశ్చర్యమే. ఈ వ్యూస్ తో రామ్ సరికొత్త రికార్డు అందుకున్నాడు. ఇప్పటి వరకూ హిందీలో అనువాదమైన ఆరు చిత్రాలకి వంద మిలియన్లు రాబట్టుకుని, ఆ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా రికార్డుకి ఎక్కాడు. ఈ లెక్కన హిందీ ప్రేక్షకుల్లో రామ్ పై ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.