గ్రీన్ టీని తాగడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే అధిక బరువును తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీని రోజూ వరుసగా 12 వారాల పాటు తాగితే సుమారుగా 3.3 కిలోల బరువు తగ్గుతారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే కేవలం గ్రీన్ టీ మాత్రమే కాకుండా అందులో పలు ఇతర పదార్థాలను కూడా కలిపి తాగితే ఫలితం ఇంకా వెంటనే వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ తయారు చేసుకునేటప్పుడు అందులో పుదీనా ఆకులు, నిమ్మరసం, అల్లం, తేనె వంటివి కలుపుకుని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించి పక్కన పెట్టాలి. తరువాత ఒక కప్పులో గ్రీన్ టీ ఆకులు, పుదీనా ఆకులు, నిమ్మరసం, అల్లం రసం, తేనె కొద్ది కొద్దిగా వేయాలి. అనంతరం అందులో ముందుగా మరిగించి పెట్టిన నీటిని పోయాలి. 2 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత తాగాలి. ఈ డ్రింక్‌ను తీసుకోవడం వల్ల కేవలం 7 రోజుల్లోనే అధిక బరువు తగ్గవచ్చని, శరీర బరువులో చాలా వరకు మార్పు కనిపిస్తుందని డైటిషియన్లు చెబుతున్నారు.
గ్రీన్ టీని నిజానికి కొందరు ఏమీ కలపకుండా అలాగే తాగుతారు. కానీ పైన తెలిపిన విధంగా దాన్ని నిత్యం తయారు చేసుకుని తాగితే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. శరీర రోగ రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు అధిక బరువు వేగంగా తగ్గవచ్చు. అలాగే శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. శరీరం శుభ్రమవుతుంది. లివర్‌కు సపోర్ట్ లభిస్తుంది.