టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు… రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్జివి కి ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై.. ట్వీట్ చేస్తూ ట్రెండింగ్లో ఉంటారు రాంగోపాల్ వర్మ.అయితే.. తాజాగా వైసీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబులను తీసేస్తే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అస్సలు కనిపించదంటూ పేర్కొన్నారు.
వారుద్దరూ వైసీపీ పార్టీకి.. మూల స్థంబాలాంటోళ్లని.. వారు ఎప్పుడూ ఎటాకింగ్ గా మాట్లాడే వ్యక్తులని కొనియాడారు. అలాంటి లీడర్లు ఉండే.. పార్టీ బలంగా ఉంటుందని.. తప్పు చేసినా.. వారి ఎటాకింగ్ తో తప్పించుకోవచ్చన్నారు. అలాగే.. చంద్రబాబు ఎడవటం చాలా తప్పని.. కానీ టీడీపీ బుద్దా వెంకన్న లాంటి లీడర్లు… హీరోలు అంటూ కామెంట్ చేశారు. అధికార పార్టీని ఎదరించే సత్తా బుద్దా వెంకన్నకు ఉందన్నారు. మనం ఓటమి అంచుల్లో ఉన్నా.. ప్రత్యర్థులపై దాడి చేసే సత్తా ఉండాలని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.