ఆ హీరోయిన్ కాళ్లు మొక్కిన వ‌ర్మ‌.. మ‌రీ ఇంత దారుణంగానా..

-

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఓ సంచ‌ల‌నం. ప్ర‌భంజ‌నం. ఆయ‌న్ని, ఆయ‌న తీసిన సినిమాల్నీ చూసి ద‌ర్శ‌కులు కావాలన్న ఆశ‌లు గుండెల నిండా నింపుకుని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో దిగిపోయిన వాళ్లెంతో మంది. ఈ యేడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో వర్మ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే తాజాగా వర్మ .. హీరోయిన్‌ నైనా గంగూలీ కాళ్లను మొక్కారు. వర్మ సమకూర్చిన కథతో ‘బ్యూటిఫుల్’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు అగస్త్య మంజు దర్శకత్వం వహించారు.

ఈ సినిమా జనవరి 1న విడుదల కానున్న నేపథ్యంలో ఆ సినిమా బృందం నిన్న సాయంత్రం ప్రీ న్యూ ఇయర్‌ ప్రైవేటు పార్టీ చేసుకుంది. సినీ బృందంలో కలిసి ఆర్జీవీ డ్యాన్సులు వేసి ఉత్సాహంగా గడిపారు. ఈ సినిమాలోని రా కసితీరా అనే పాటకు హీరోయిన్‌ నైనాతో కలిసి ఆయన డ్యాన్స్‌ చేశారు. ఇందులో భాగంగా ఆయన హీరోయిన్‌ నైనా కాళ్లపై ప‌డ్డారు. దీంతో అక్క‌డ ఉన్న‌వాళ్లంతా షాక్‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news