రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రజలకు రాజధాని రూపంలో తగిలిన షాక్ నేటికీ పీడిస్తోంది. ఏపీ ప్రజలకు ఉమ్మడి రా జధానిగా హైదరాబాద్‌ను పదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే, 2015లోనే అప్పటిసీఎం చంద్రబాబు అ నూహ్యంగా ఏపీకి తరలి వచ్చి ఇక్కడ రాజధాని ఏర్పాటు, నిర్మాణాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పక్కన పెట్టి తన పార్టీకే చెందిన పి. నారాయణ నేతృత్వం లో కమిటీని వేసుకోవడం, ఆ నివేదిక ప్రకారం అమరావతిని ఎంచుకోవడం దీనికి ప్రధాని నరేంద్ర మోడీతో శంకు స్థాపన కూడా చేయించడం తెలిసిందే.
అయితే, బాబు పాలన ముగిసే నాటికి రాజధాని అమరావతిలో ఎక్కడా పర్మినెంట్ భవనాలు నిర్మించింది లేదు. అన్నీ తాత్కాలి క భవనాల్లోనే లాగించారు. చివరకు హైకోర్టును కూడా 2039 నాటికి పర్మినెంట్ భవనాన్ని కట్టేలా ప్రతిపాదించారు. దీంతో రాజధా ని విషయంలో ఎప్పటికప్పుడు అనేక ప్రశ్నలు వచ్చాయి. రాజధానికి కేంద్రం 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది. అయితే, దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో 4 వేల కోట్లు కలిపి ఖర్చు చేసింది. అయినా కూడా ఎక్కడా ఆశించిన మేరకు అభివృద్ధి జరిగింది లేదు.
దీం తో రాజధాని అంశం.. ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగానే మారిపోయింది. ఇక, కేంద్రం దృష్టిలో అమరావతి అంటే కేవలం కోర్ కేపిటల్ మాత్రమే. మిగిలిన అభివృద్ధి అంతా కూడా రాష్ట్రప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక, గత ప్రభుత్వ హయాంలో రాజధానికి నిధులు ఇచ్చిన కేంద్రం ఇప్పటికే తాము ఇవ్వాల్సిన వాటా ఇచ్చామని చెప్పుకొచ్చిం ది. పలితంగా ఇప్పుడు ఏపీకి కేంద్రం నుంచి వచ్చే సొమ్ము ప్రత్యేకంగా లేక పోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది.
ఇక, ఇప్పటి ప్రభుత్వ నిర్ణయాలు, ప్రాధాన్యాలు కూడా అమరావతి అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయనడంలో సందేహం లేదు. అదేసమయంలో అమరావతి విషయంలో గత ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు, వీటి పరిశోదనలు కూడా సాగుతున్నాయి. దీనికి తోడు పాలన వికేంద్రీకరణకే తాము కట్టుబడి ఉన్నామని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రాజధాని అనే విషయం ఇప్పుడు అత్యంత కీలక పరిణామంగా మారిపోయింది.
ఇప్పుడు ఏర్పడిన చిక్కుముడులు పరిష్కారం అయి, రాష్ట్రానికి ఓ రాజధాని ఏర్పాటు కావడం అనేది ఇప్పట్లో అసలు జరుగుతుందా? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. దీంతో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ రాజధాని విషయంపై సంబరాలు కానీ, సంతోషం కానీ లేక పోవడం గమనార్హం. గత చంద్రబాబు ప్రభుత్వం అలా చేస్తే.. ఇప్పుడు జగన్ సర్కారు ఇలా చేస్తోందంటూ.. ప్రజలే విస్తు పోతున్న పరిస్థితి కనిపిస్తోంది.