అను హాట్.. రామ్ ఫ్లాట్.. హలో గురు ప్రేమకోసమే టీజర్..!

-

చూశావా నీకోసమే.. కాఫీ.. ఎలా ఉంది.. హాట్ గా ఉంది.. ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న హలో గురు ప్రేమ కోసమే టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న హలో గురు ప్రేమ కోసమే సినిమా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తుంది.

నేను లోకల్ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు త్రినాథ రావుతో దిల్ రాజు మరోసారి చేస్తున్న క్రేజీ మూవీ ఇది. కొద్ది నిమిషాల క్రితం రిలీజైన టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా బరిలో రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 18న రిలీజ్ ప్లాన్ చేస్తున్న హలో గురు ప్రేమకోసమే టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

టీజర్ చూస్తే ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాగా అనిపిస్తుంది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ తర్వాత త్రినాథ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రాం కు సూపర్ హిట్ ఇస్తుందో లేదో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news