రామ్ ” రెడ్ ” సినిమా లేటెస్ట్ అప్‌డేట్ …!

-

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం రెడ్. ఈ సినిమాని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్టయిన తడం సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా తెలుగులో నిర్మిస్తున్నారు. కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో రామ్ కిషోర్ తిరుమల తో కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చి హిట్ అయిన సంగతి తెలిసిందే.

 

రామ్ గత చిత్రం ఇస్మార్ట్ శంకర్ కూడా మాంచి మాస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడు. నివేదా పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ గెస్ట్ రోల్ లో నటిస్తుంది. అంతేకాదు ఒక సాంగ్ లోను రామ్ కలిసి స్టెప్పులేసింది. మణిశర్మ సంగీతమందిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ ని ఇచ్చారు చిత్ర బృందం. రేపు సాయంత్రం 5:15 నిమిషాలకు ఈ సినిమానుండి ‘నువ్వే నువ్వే’ అనే సాంగ్ మేకింగ్
వీడియోని రేపు విడుదల చేస్తారట. ఈ అప్డేట్ ని చిత్ర యూనిట్ టిట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news