రానా ఇప్పుడే మొదలెట్టాడు..

-

ఎనిమిది నెలలుగా షూటింగులకి దూరంగా ఉన్న రానా, బయటకి వచ్చాడు. లాక్డౌన్ టైమ్ లో మిహీకా బజాజ్ ని పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు మూడు సినిమాల కోసం మళ్లీ లోకేషన్ కి బయలు దేరాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్న రానా షూటింగ్ కి వెళ్ళడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని తెలిపాడు. రానా చేతిలో విరాట పర్వంతో పాటు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి.

విరాట పర్వం తొంభైశాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీలక సన్నివేశమైన యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించాల్సి ఉందట. అందుకోసం ఎక్కువ మంది కావాల్సి ఉంటుందని, కరోనా టైమ్ లో కుదరదని చెప్పారు. మరి పరిస్థితులు ఇంతకుముందు కంటే మెరుగుపడ్డాయి. ఇప్పుడైనా షూటింగ్ కంప్లీట్ చేసుకుని, రిలీజ్ కి రెడీ అవుతారేమో చూడాలి. విరాట పర్వంలో సాయ్ పల్లవి హీరోయిన్ గా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news