క‌డక్‌నాథ్ కోళ్ల‌ను పెంచ‌నున్న ధోనీ.. 2వేల కోడిపిల్ల‌ల‌కు ఆర్డ‌ర్‌..

-

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కొత్త బిజినెస్ పెట్ట‌బోడుతున్నాడు. అవును.. ఎంతో పేరుగాంచిన క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌ను అత‌ను త‌న రాంచీ ఫాం హౌజ్‌లో పెంచ‌నున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంత‌రం ధోనీ ఈ మ‌ధ్యే ఐపీఎల్‌లో క‌నిపించాడు. కానీ ఈసారి చెన్నై టీం అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. అయితే వ‌చ్చే సీజ‌న్‌లో చెన్నైకి ధోనీయే కెప్టెన్‌గా ఉంటాడో, లేదో తెలియ‌దు కానీ.. ధోనీ బిజినెస్‌ల వైపు దృష్టి సారించాడు. ఈ క్ర‌మంలోనే క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌ను పెంచాల‌ని ధోనీ నిర్ణ‌యించుకున్నాడు.

mahendra singh dhoni to farm kadaknath chicken

కాగా రాంచీ వెట‌ర్న‌రీ కాలేజ్‌లోని ఓ స్నేహితుడి స‌హాయంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉన్న ఓ పౌల్ట్రీ ఫాంకు చెందిన జ‌బువా అనే రైతుకు ధోనీ 2వేల క‌డ‌క్‌నాథ్ కోడి పిల్ల‌ల‌ను ఆర్డ‌ర్ ఇచ్చాడు. ఈ విష‌యాన్ని ఆ రైతు స్వ‌యంగా తెలిపాడు. డిసెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు ఆ కోడిపిల్ల‌లు కావాల‌ని ధోనీ ఆ రైతుకు చెప్పాడు. దీంతో ఆ స‌మ‌యంలోగా ఆ కోడిపిల్ల‌ల‌ను ఆ రైతు ధోనీకి పంప‌నున్నాడు. వాటితో రాంచీలోని త‌న ఫాం హౌజ్‌లో ధోనీ కోళ్ల పెంప‌కం చేప‌ట్ట‌నున్నాడు.

ఇక క‌డ‌క్‌నాథ్ కోళ్లలో సాధార‌ణ కోళ్ల‌తో పోలిస్తే ఫ్యాట్‌, కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటాయి. సాధార‌ణ కోళ్ల‌లో ఫ్యాట్ 25 శాతం ఉంటే క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌లో 1.94 శాతం మాత్ర‌మే కొవ్వు ఉంటుంది. కొలెస్ట్రాల్ సాధార‌ణ కోళ్ల‌లో 218 మిల్లీగ్రాములు ఉంటే క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌లో 59 మిల్లీగ్రాములు మాత్ర‌మే ఉంటుంది. అలాగే ఇత‌ర కోళ్ల క‌న్నా క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌లోనే ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అందుక‌నే ఈ కోళ్లకు ప్ర‌స్తుతం డిమాండ్ బాగా పెరిగింది. దీంతో అనేక చోట్ల ఈ కోళ్ల‌ను రైతులు పెంచుతూ లాభాలు గ‌డిస్తున్నారు. ఈ కోళ్ల‌కు చెందిన మాంసం, గుడ్లు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముడ‌వుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news