రానా సినిమా ఏదీ ఇన్నేళ్ళు ఆగిపోలేదు ..ఒక్క ‘అరణ్య’ సినిమా తప్ప …!

-

రానా దగ్గుబాటి మొదటి సినిమా లీడర్ నుంచి ఆయన ఏ సినిమా చేసినా కూడా ఇంతగా ఆలస్యం అయిన సినిమా ఏది లేదు. ఒక్క అరణ్యం తప్ప. ఈ సినిమా మొదలి దాదాపు రెమేళ్ళు కావస్తుంది. తెలుగులో అరణ్య గా, తమిళ్ లో కాడన్, హిందీలో హాథీ మేరే సాథీగా వస్తోన్న ఈ సినిమాలో రానా వైల్డ్ లుక్ లో కనిపించబోన్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ అండ్ టీజర్ అన్ని భాషల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.

 

అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాని రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేశారు. వాస్తవంగా ఉగాదికి విడుదల కావాల్సిన నాని ‘ వి ‘ సినిమా విడుదల వాయిదా పడింది. అలాగే కోనా ఫిల్మ్ కార్పోరేషన్ లో నిర్మించిన మల్టీ లాంగ్వేజ్ సినిమా నిశబ్ధం కూడా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాల రిలీజ్ ఎప్పుడుంటుందో మేకర్స్ ఇంకా క్లారిటి ఇవ్వ లేదు. మరోవైపు బాలీవుడ్‌లో చాలా మంది మేకర్స్ త సినిమాల రిలీజ్ డేట్స్ ని మార్చుకున్నాయి.

 

తాజాగా రానా హీరోగా నటించిన ‘అరణ్య’ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అన్ని షూటింగ్స్ నిలిపి వేశారు. మరోవైపు బాలీవుడ్‌లోను అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌ను రద్దు చేసారు. వాటిలో కొన్ని సినిమాలు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే షెడ్యూల్స్ ప్లా చేసుకున్నారు. కాని ప్రస్తుతం ముంబై నుండి ఇక్కడి వచ్చే పరిస్థితులు లేని నేపథ్యంలో అవన్ని ఆపేశారు.

 

ఇక తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ తెరకెక్కించిన అరణ్య సినిమాలో రానా అడవి మనిషిగా నటిస్తున్నాడు. ఈ సినిమా మీద ఇప్పటికే అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాను 1971 లో రాజేష్ ఖన్నా నటించిన హాథీ మేరే సాథీ కి ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశిప సినిమాలో నటించబోతున్నాడు రానా. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందనుంది.

Read more RELATED
Recommended to you

Latest news