అల్లు అరవింద్ నిర్మాణంలో మరో ‘రామాయణం’ .. రాముడిగా రణ్‌బీర్‌, రావణుడిగా యశ్‌

-

టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రామాయణం సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వంలో.. నితేశ్​తో పాటు నిర్మాత మధు వంతెనతో కలిసి ఈయన ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.

ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ను.. సీత పాత్ర కోసం ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ఇద్దరికి లుక్ టెస్టు కూడా చేశారట. అయితే దర్శకుడు నితేశ్‌ తివారీతో అలియా భట్ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. గతంలో సీతగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలు వినిపించాయి. కానీ, సడెన్‌గా తెరపైకి ఆలియా వచ్చేసింది. ఈ సినిమాలో రావణుడిగా కేజీయఫ్‌ హీరో యశ్‌ను ఓకే చేశారని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కోసం సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version