బోండా ఉమా, బుద్ధా వెంకన్న ఇద్దరూ గొట్టం గాళ్లు – కేశినేని నాని

-

బోండా ఉమా, బుద్ధా వెంకన్న ఇద్దరూ గొట్టం గాళ్లు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు టీడీపీ పార్టీ ఎంపీ కేశినేని నాని. బెజవాడ టీడీపీ విబేధాలు మరోమారు రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర నేతలు టార్గెట్ గా కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నన్ను మున్సిపల్ ఎన్నికల సమయంలో గొట్టం గాడు, చెప్పుతో కొడతా అన్నారని.. అలాంటి గొట్టం గాళ్ల ఫోటోలు కూడా కేశినేని భవన్ బిల్డింగ్ ఫోటో మీద వేశామని చురకలు అంటించారు. అలాంటి గొట్టం గాళ్ళ గెలుపు కోసం కూడా పని చేస్తున్నా.. పార్టీ పేరుతో ఉన్న కేశినేని భవన్ నుంచి బెజవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవ చేస్తున్నానని వెల్లడించారు.

నేను ఇక్కడ నుంచి పని చేస్తున్నా ఇంకా నేను ఎందుకు స్పందించాలని నాని పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలో గొట్టం గాళ్ళ కోసం కూడా నేను పనిచేస్తున్నానని.. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని చెప్పారు. అయోధ్య రామరెడ్డి నేను మంచి వాడిని కాబట్టే అలా మాట్లాడారని.. వేరే పార్టీ ఆఫర్లు మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. నాకు 100 శాతం మండితే అపుడు పార్టీ మారడంపై ఆలోచిస్తానని ప్రకటన చేశారు కేశినేని నాని.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version