పల్లెటూరి పడుచందంలో తనని తాను వెతుక్కుంటున్న రాశీఖన్నా..

గత కొన్ని రోజులుగా రాశీఖన్నా సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. వరుస ఫోటోషూట్లతో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. ఐతే ఈ ఫోటోషూట్లలోనూ చాలా వైవిధ్యం చూపిస్తుంది. సినిమాల్లో కనిపించని గెటప్పుల్లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

మొన్నామధ్య చీరలో పల్లెటూరి పడుచులా కనిపించింది. ఆ తర్వాత అల్ట్రా పాష్ గా కనిపించింది. తాజాగా మరోసారి పల్లెటూరి ఆడపిల్లలా కనువిందు చేసింది. చుట్టూ పచ్చని వాతావరణంలో బంగారు వర్ణం గల చీరలో మెరిసిపోతుంది. అచ్చ తెలుగు ఆడపిల్లలా చీరలో మరింత అందంగా కనిపించింది. నడుమందాలు కనబడేలా చీరకట్టు కట్టి తన ఫాలోవర్స్ మతి పోగొడుతుంది.

ఫోట్లని పంచుకుని తనని తాను వెతుక్కుంటున్నానని క్యాప్షన్ పెట్టింది. మొత్తానికి రాశీఖన్నా అందంతో అందరి దృష్టిలో పడుతుంది. ప్రస్తుతం రాశీఖన్నా చేతిలో తమిళ చిత్రాలున్నాయి.