పవన్ వల్ల అది సాధ్యమవుతుంది : రష్మి

-

rashmi gautam comments on pawan kalyan

ఇన్నాళ్లు పొలిటికల్ గా ఓ కామెంట్ చేయాలన్నా భయపడే టాలీవుడ్ నటీనటులు ఇప్పుడు ఒక వ్యక్తికి సపోర్ట్ గా మాట్లాడటం ప్రత్యేకమైన విషయమని చెప్పుకోవాలి. ముఖ్యంగా సిని పరిశ్రమలో జనసేన గాలి బాగా వీస్తుంది. మెగా కాంపౌండ్ తో సత్సంబంధాలున్న అందరు పవన్ పార్టీకే జై కొడుతున్నారు. వీరిలో చిన్న చితకా ఆర్టిస్టుల నుండ్ స్టార్ హీరోల దాకా ఉండటం విశేషం.

rashmi gautam comments on pawan kalyan

ఇదిలాఉంటే పవన్ రాజకీయ ప్రక్షాళణ చేస్తారని నమ్మే వారిలో బుల్లితెర యాంకర్స్ కూడా ఉండటం విశేషం. రీసెంట్ గా జబర్దస్త్ యాంకర్ రష్మిని పవన్ రాజకీయాపై ఓ అభిమాని అభిప్రాయం చెప్పమన్నాడు. అయితే దానికి ఆన్సర్ ఇస్తూ రాజకీయాల్లో మార్పు కావాలనుకునే ప్రజలు పవన్ కళ్యాణ్ ను కచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్పుకొచ్చింది. మార్పు తెచ్చే సత్తా పవన్ కు ఉందని బల్ల గుద్ది మరి చెబుతుంది రష్మి. ఫ్యాన్ అడిగాడు కాబట్టి చెప్పాడని అనిపిస్తున్నా రష్మికి కూడా పవన్ రాజకీయాల్లో గెలుస్తాడన్న నమ్మకం ఉంది కాబోలు అందుకే అంత కచ్చితంగా పవన్ మీద తన కామెంట్స్ చేసిందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news