మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ…

-

పలు అంశాలపై కీలక చర్చలు

పాత చిత్రం

ప్రధాని నరేంద్ర మోదీతో తెరాస అధినేత కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే భేటీ అయ్యారు. 7 లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో ఆయన్ని కేసీఆర్ కలిశారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోడీని ఆయన కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కేసీఆర్ కోరనున్నారు.

రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపైనా చర్చించనున్నట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రకటించిన హామీలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో నూతన సచివాలయం, నూతన అసెంబ్లీ నిర్మాణానికి బైసన్‌ పోలో భూములను రాష్ట్రానికి అందించాలి.

కేసీఆర్ – మోదీ భేటీలో తెలంగాణకు సంబంధించిన కింది అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు….

– రక్షణ శాఖకు చెందిన భూములు, పరిసరాల్లో రోడ్ల విస్తరణ చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలి. 
కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలి.
హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.

 కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
హైదరాబాద్‌లో ఐఐఎస్‌ఈఆర్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి.
  జహీరాబాద్‌లో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్ మ్యానుఫేక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు అవకాశం కల్పించాలి. 
ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. 
 వెనుకబడిన జిల్లాలకు ఏటా ఇచ్చే రూ.450 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
 కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేయాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో ఉంది గనక వెంటనే మంజూరు చేయాలి. 
 కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, నదీ జలాల పంపకంలో నెలకొన్నవివాదాల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి.
 కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. 
గిరిజన విశ్వవిద్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలి. 
 ఏపీ విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలకు సంబంధించి వెంటనే విభజన ప్రక్రియను పూర్తి చేయాలి. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను అవకాశం ఉన్నంత త్వరగా నెరవేర్చాలి.  
 

Read more RELATED
Recommended to you

Latest news