కాటుక కళ్లతో మాయ చేస్తోన్న జబర్దస్త్ అందం రష్మి గౌతమ్

బుల్లితెరపైన గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది యాంకర్ రష్మి గౌతమ్. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో ఈ భామ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే అందాల ఆరబోతలో అస్సలు తగ్గేదేలే అని అంటుంది. ట్రెండీ వేర్ లోనైనా సంప్రదాయ వస్త్రాల్లోనైనా అందం, ఆభరణాల విషయంలోనైనా రష్మి గౌతమ్ ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నట్లు కనబడుతుంటుంది.

హాట్ నెస్ కు మారు పేరు అయిన రష్మి గౌతమ్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో రష్మి గౌతమ్ చాలా అందంగా కనబడుతోంది. చిలిపిగా కవ్విస్తూ ఫోజులిచ్చింది.

అలా కొంటె చూపులు చూస్తూ, నడుము పై చేయి వాల్చి, అటు వైపునకు చూస్తూ, రకరకాల ఫోజులు ఇచ్చింది ఈ సుందరి. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘ఆ..క్యూట్ , స్మైల్ లవ్లీ, బ్యూటిఫుల్, హాటీ’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక బుల్లితెరపైన కార్యక్రమాల్లో సుధీర్ – రష్మిల లవ్ స్టోరి ట్రాక్ ఇంకా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిరువురి ఆన్ స్క్రీన్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.