టాలీవుడ్‌లో లాక్‌డౌన్ టైమ్ నుంచి వరుసగా పెళ్లిళ్ల హంగామా నడుస్తున్న విషయం తెలిసిందే. నిర్మాత దిల్ రాజు రెండవ పెళ్లి నుంటి టాలీవుడ్‌లో వివాహాల సందడి మొదలైంది. ఆ తరువాత నిఖిల్, నితిన్, రానా.. నేడు కాజల్ అగర్వాల్.. త్వరలో నిహారిక కొణిదెల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా తాను కూడా పెళ్లి చేసుకోబోతున్నానని బిగ్‌బాస్ ఫేమ్, నటి పునర్నవి భూపాలం కూడా గుడ్ న్యూస్ చెప్పేసింది.
ఈ వార్తల నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయిపోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ యాంకర్, హీరోయిన్ రష్మీ గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రష్మీ గౌతమ్ సారీల్లో ఫొటోలకు పోజులిస్తోంది. వాటిని క్రమం తప్పకుండా ఇన్ స్టాలో పోస్ట్ చేస్తోంది. కాజల్ అగర్వాల్ కూడా ఇలాగే చేసి పెళ్లి వార్తలో షాకిచ్చిన విషయం తెలిసిందే.
రష్మి కూడా ఇదే తరహాలో షాకి ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని రష్మిగౌతమ్ ఫాలోవర్స్ అడిగితే మౌనంగా వుంటోంది. వారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. దీంతో రష్మీగౌతమ్ కూడా కాజల్ తరహాలోనే షాకి ఇవ్వడానికి రెడీ అవుతోందంటూ ప్రచారం మొదలైంది. సుడిగాలి సుధీర్ తో రష్మిక ప్రేమలో వుందని, అందుకే వారిద్దరి మధ్య స్టేజ్‌పై మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవుతోందంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్ని ఇద్దరూ కొట్టి పారేసినా ఇప్పటికీ అదే నిజమని చాలా మంది వాదిస్తున్నారు కూడా.