అనసూయ స్థానంలో రష్మీ గౌతమ్..అంతటి క్రేజ్ వచ్చేనా?

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న అనసూయ భరద్వాజ్ ..‘రంగస్థలం’ సినిమాతో వెండితెరపైన మెరిసింది. అంతకు ముందు పలు సినిమాల్లో అనసూయ భరద్వాజ్ కనిపించినప్పటికీ ఆ చిత్రం తర్వాత అనసూయకు చక్కటి అవకాశాలు లభించాయి. అలా ప్రస్తుతం అనసూయ టాలీవుడ్ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది.

పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే మరో వైపున ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ఈటీవీ సూపర్ హిట్ కామెడీ షో ‘జబర్దస్త్’ లో యాంకర్ గా ఇన్నాళ్ల పాటు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ తాజాగా ‘జబర్దస్త్’ను వీడింది. ఈ మేరకు ఆమె అధికారిక ప్రకటన చేసింది. స్టార్ మా కార్యక్రమాల్లో అనసూయకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

అలా స్టార్ మా వారి ప్రోగ్రామ్స్ తో పాటు తనకు వచ్చిన సినిమాల్లో పాత్రలు పోషిస్తూ అనసూయ దూసుకుపోయేందుకు సిద్ధమైంది. కాగా, ఇప్పుడు ‘జబర్దస్త్’ షోలో అనసూయ భరద్వాజ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?అన్న ప్రశ్న ఎదురవుతోంది. అనసూయ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం రష్మీ గౌతమికి ఉందని ఈటీవీ మల్లెమాల వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ‘జబర్దస్త్’ ఎపిసోడ్స్ కు రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో రష్మీ గౌతమ్ ..అనసూయ భరద్వాజ్ స్థానాన్ని భర్తీ చేస్తుందని అనుకుంటున్నారు. జనాలకు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడంతో పాటు తన యాంకరింగ్ తో కమెడియన్స్ లో జోష్ నింపేందుకు ట్రై చేయడానికి రష్మీ గౌతమ్ ప్రయత్నిస్తున్నదని అభిప్రాయపడుతున్నారు.