విజయ్ దేవరకొండతో ఎఫైర్ పై క్యూట్ రియాక్షన్ ఇచ్చిన రష్మిక..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడి గీతాగోవిందం సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా వీరు నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. అయితే ఈ రెండు సినిమాల ద్వారా ఏర్పడిన వీరి పరిచయం మరింతగా బలపడిందని చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం , పబ్ , టూరు, షికారు అంటూ తెగ చక్కర్లు కొడుతూ ఉంటారు. ఇక అందుకే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇదే విషయంపై వీరిని అడిగితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇకపోతే రష్మిక మందన్నా ఇదివరకే రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జాతకరీత్యా అతడితో బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి అలాగే విజయ్ దేవరకొండ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇకపోతే కెరియర్ తొలినాళ్లల్లో రష్మిక పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టికి దూరమైంది. వీరి బ్రేకప్ అప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ హాపీగా మారింది. ఇక దీని నుంచి బయటపడ్డాక వీరిద్దరూ వారి కెరియర్స్ లో బిజీగా మారిపోయారు. ఇక రష్మిక స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. నేను నా మాజీ బాయ్ ఫ్రెండ్ ని ఇప్పటికీ మంచి స్నేహితుడు గానే భావిస్తాను. ప్రస్తుతం వారి పార్ట్నర్స్ , ఫ్యామిలీని మీట్ అయ్యేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సమాధానం ఇచ్చింది.

మాజీ బాయ్ ఫ్రెండ్ తో ఫ్రెండ్షిప్ కొనసాగించడం మంచి లక్షణం కాదు కానీ నేను ఎవరికీ శత్రువుగా ఉండను అని తెలిపింది.. ఇకపోతే ప్రస్తుతం తన రిలేషన్షిప్ పై కూడా చాలా క్యూట్ గా సమాధానం ఇచ్చింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగానే విజయ్ దేవరకొండ తో మీ రిలేషన్ గురించి వస్తున్న రూమర్స్ పై ఎలా స్పందిస్తారు అని అడగగా వినడానికి చాలా క్యూట్ గా ఉంటుంది అంటూ బదులిచ్చింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నిజంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న మద్య ఎఫైర్ వుందని తెలుస్తోంది.