టాలీవుడ్ టు బాలీవుడ్‌.. ర‌ష్మిక ప్లాన్ మాములుగా లేదు క‌దా

క్యూట్ స్మైల్‌తో సినీ ఇండ‌స్ట్రీని ఆగం జేసింది ఓ పిల్ల‌. ముద్దు ముద్దు మాట‌ల‌తో అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. చాలా త‌క్కువ టైమ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె ఎవ‌రో కాదు ర‌ష్మికా మండ‌న్నా. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌పై క‌న్నేసింది. బాలీవుడ్‌లో రాణించాల‌నేదే త‌న డ్రీమ్ అని ఇప్ప‌టికే చెప్పింది.

డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా అంద‌రి కంట ప‌డింది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈమెనే స్టార్ హీరోయిన్‌. అందానికి మించిన అభిన‌యం, డ్యాన్సుల‌తో కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.

ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా వ‌రుస‌గా సినిమాలు ఓకే చేస్తోంది. మిషన్ మజ్ను, తో పాటు గుడ్‌బైలో న‌టిస్తోంది. గుడ్‌బై సినిమాలో అమితాబ‌చ‌న్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. దీంతో త‌న ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోతున్నాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో కూడా విప‌రీతంగా ఫాలోవ‌ర్స్ పెరిగిపోతున్నారు. మ‌రి ఈమె రానున్న కాలంలో శృతిహాస‌న్‌లాగా బాలీవుడ్‌లో పాగా వేస్తుందా లేదా చూడాలి.