కోర్ట్ చెయ్యోద్దన్న పనిని ప్రభుత్వం చేసి చూపిస్తుంది: తెలంగాణా హైకోర్ట్ ఫైర్

-

ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల్లో పోలీసులు ఆపడంపై హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్ట్ చెయ్యొద్దన్న పనిని ప్రభుత్వం చేసి చూపిస్తుందని హైకోర్టు విచారణ సందర్భంగా పేర్కొంది. సర్క్యులర్ జారీ చేసిన అధికారి చర్యలు కోర్ట్ ధిక్కరణ కిందకు వస్తాయని హైకోర్టు హెచ్చరించింది. ఇతర రాష్ట్ర రోగుల పైన తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదా అంటూ హైకోర్ట్ మండిపడింది.

పలు రాష్ట్రాల్లో పేషంట్ ఎంట్రీ పై సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చాక కూడా మీరు ఈ విదంగా ఎలా ముందుకు వెళ్తారని హైకోర్ట్ ప్రశ్నించింది. సర్క్యులర్ లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్ జారీ చేయాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆపొద్దని చెప్పినా ఎలా ఆపుతారని మండిపడింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసిన కోర్ట్ తాము మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చే వరకు జోక్యం చేసుకోవద్దని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news