తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు, తమిళ, మళయాళ ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకుంది రష్మికామండన్నా. భాషతో సంబంధం లేకుండా కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తన మాజీ ప్రియుడితో బ్రేకప్ అయిన తర్వాత రష్మిక సినిమాల్లో దూసుకుపోతోంది. కేవలం సినిమాల మీదనే దృష్టి పెడుతోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప సినిమాలో నటిస్తోంది.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం పోటీనిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ మళయాల భామ. ప్రస్తుతం ఈ సొట్టబుగ్గల సుందరి సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా మిషన్ మజ్ను సినిమాలో, అలాగే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో గుడ్ బాయ్ మూవీలో బంపర్ ఛాన్స్ కొట్టేసింది ఈ సుందరి.
ఇప్పుడు ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఈ ఇయర్ సెకండాఫ్ లో ఈ రెండు మూవీలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే రష్మిక ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని పంచుకుంది. తాను అమితాబ్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నానని చెబితే తన సొంత తల్లిదండ్రులే నమ్మలేదని, జోక్ చేస్తున్నావని చెప్పారని రష్మిక చెప్పుకొచ్చింది. అయితే వాళ్లను నమ్మించడానికి చాలా టైమ్ పట్టిందని తెలిపింది. తన పేరెంట్స్ అమితాబ్ బచ్చన్ కు ఫ్యాన్స్ అని, అమితాబ్ సినిమాలను వాళ్లు తప్పకుండా చూస్తారని ఆమె వివరించారు. ఇక గుడ్ బాయ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కు కూతురు పాత్రలో రష్మిక నటిస్తోంది.