పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా? మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి..

-

కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. పెళ్ళీడు దగ్గర పడుతుంటే సంబంధాలు ఒకదాని వెనక ఒకటి వస్తుంటే, ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకో అని పోరు పెడుతుంటే పెళ్ళి చేసుకోవాల్సిన టైమ్ వచ్చేసిందని సిద్ధమైపోతున్నట్లయితే కొన్ని విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. పెళ్ళి చేసుకునే ముందే ఈ విషయాలను తెలుసుకోవాలి. కాదు కాదు పెళ్ళి చూపులకి ముందే ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది. అవేంటంటే..

మొదటి చూపులోనే నచ్చడం అనేది కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. పెళ్ళిచూపుల్లో మొదటి చూపులోనే నచ్చేసారని, అవతలి వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండా ఒప్పుకోవద్దు.

మీ కాబోయే భాగస్వామి ఆదాయం, ఆస్తులు చూసుకుని పెళ్ళి చేసుకోవద్దు. పెళ్ళనేది మనసుకు సంబంధించినది. ఇష్టం లేని వారితో కలిసి కాపురం ఎక్కువ కాలం చేయలేరు.

పెళ్ళి చూపులయ్యాక మీకు అవకాశం ఉంటే మీ కాబోయే భాగస్వామితో రెస్టారెంట్ కి వెళ్ళండి. అక్కడ అతని పవర్తన అర్థమవుతే అతను మీతో ఎలా ఉంటాడనేది తెలుస్తుంది.

అందంగా ఉన్నారని పెళ్ళి చేసుకోవద్దు. అర్థం చేసుకునేలా ఉన్నారని చేసుకోండి. అందం ఎప్పటికైనా మారిపోతుంది. అర్థం చేసుకునేతనం మారదు. చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. అందంగా ఉన్నారు, మనలో కలిసిపోతారని పెళ్ళి చేసుకుంటారు. కానీ పెళ్ళయ్యాక వీళ్ళనుకున్నవన్నీ రివర్స్ అవుతాయి. అప్పుడు చేసేదేమీ ఉండదు.

పెళ్ళనేది మీ ఎంపిక. మీ తల్లిదండ్రులు చేసుకోమంటున్నారో, మీ బంధువులు పోరు పెడుతున్నారనో చేసుకోవద్దు.

రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్న భావాలతో పెళ్ళి చేసుకోవద్దు. చేసుకోవాలని ఉంటేనే చేసుకోండి. లేదంటే ఊరుకోండి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news