అన్నదమ్ములను కవర్‌ చేసేస్తున్న కన్నడ బ్యూటీ

-

లాక్‌డౌన్‌ ఎత్తేసినా.. రష్మిక ఇంతవరకు సెట్స్‌పైకి రాలేదు. ఇంట్లో వుంటూనే కొత్త సినిమాలకు సైన్స్‌ చేసేస్తోంది. తమిళ డెబ్యూ మూవీ రిలీజ్‌ కాకుండానే.. పెద్ద హీరో సినిమా ఒప్పుకుంది. తెలుగులో మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రెమ్యునరేషన్‌ పెంచేసినా… ఈ అమ్మడే ఎందుకు కావాలంటున్నారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

రష్మిక తెలుగు, కన్నడకే పరిమితమైనా.. ఇండియావైడ్‌ పాపులర్‌ అయింది. 2019-2020 మధ్య నెటిజన్లు గూగుల్లో ఈ అమ్మడినే ఎక్కువగా సెర్చ్‌ చేశారు. దీంతో.. నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా ఎంపికైంది. రష్మిక సినిమాల్లో కంటే పర్సనల్‌గా బాగా నచ్చేసింది. దుస్తులు ఎంపిక చేసుకునే విధానం .. ఆమె వేసుకునే రేడియెంట్‌ మేకప్‌ నెటిజన్లకు బాగా నచ్చి.. గూగుల్లో ఈ అమ్మడి గురించి తెసుకున్నారు నెటిజన్లు.

కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన రష్మిక.. ‘సుల్తాన్’ అనే మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. కార్తీతో జత కట్టిన ఈ చిత్రం కోవిడ్‌ కారణంగా రిలీజ్‌ కాలేదు. డెబ్యూ మూవీ విడుదలకాకుండానే.. రెండో ఆఫర్‌అందుకుంది. సుల్తాన్‌తో కార్తీ సరసన నటించిన రష్మిక.. రెండో సినిమాతో సూర్యాతో జత కడుతూ.. అన్నదమ్ములిద్దరినీ కవర్‌ చేసేస్తోంది.

సరిలేరునీకెవ్వరు సెట్స్‌పై వుండగానే.. పుష్ప ఆఫర్‌ అందుకుంది రష్మిక . పుష్ప షూటింగ్‌ రీసెంట్‌గా అడవిలో మొదలైనా.. రష్మిక ఇంకా జాయిన్‌ కాలేదు. మరోవైపు ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు ‘ మూవీలో శర్వానంద్‌తో నటిస్తోంది. మొత్తం నాలుగు సినిమాలతో బిజీగా వుంది ఈ కన్నడ బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news