“సామీ – సామీ” అంటూ ఇరగదీసిన చిన్నారి..వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అవడమే కాదు ఐకాన్ స్టార్ కూడా అయిపోయారు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు విశేషం గా ఆదరించారు. ఇక ‘పుష్ప’ రాజ్ స్టైల్ లో అందరూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి బాగా వైరలయ్యాయి.

తాజాగా ఈ చిత్రంలోని ‘సామీ సామీ’ సాంగ్ కు గాను ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది. ఓ మూడేళ్ల చిన్నారి స్కూల్ యూనిఫామ్ లో ‘సామి సామి’ పాటకు డ్యాన్స్ చేసింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ చిన్నారి చేసిన మాస్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అది కాస్త హీరోయిన్ రష్మిక కంట్లో పడింది.

ఇక ఆ చిన్నారి డాన్స్ చూసిన రష్మిక, వెంటనే ఆ క్యూట్ నెస్ కి ఫ్యాన్ అయిపోయి, వెంటనే ఆ పాపను కలవాలని ఉందంటూ ట్వీట్ చేసింది. అలాగే ఆ పాపను కలవడం ఎలాగో చెబుతారా? అంటూ ట్వీట్ లో అడిగింది. దీంతో కామెంట్స్ లో అందరూ ఆ పాప నేపాల్ కి చెందిందని చెబుతున్నారు. మరి ప్రస్తుతం ఆ పాప వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.