వైర‌ల్ అవుతున్న ర‌ష్మిక ట్వీట్‌.. ఆ సినిమాల‌కు గుడ్‌బై చెప్తోందా..?

-

ర‌ష్మిక మండ‌న్నా అంటే ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ మారిన హీరోయిన్‌. ర‌ష్మిక టాలీవుడ్‌లోకి చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. కానీ త‌క్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. ఈ హీరోయిన్ ఇప్పుడు కేవ‌లం స్టార్‌ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. వ‌రుస‌గా పెద్ద హీరోల ఆఫ‌ర్లే వ‌స్తున్నాయి. కాక‌పోతే ఇప్పుడు ఎక్కువ‌గా బాలీవుడ్ లోనే న‌టిస్తూ ఉంది.

ఈ క్ర‌మంలో ఆమె మ‌ళ్లీ సౌత్ ఇండియాకు రావాల‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం ఎక్కువ‌గా బాలీవుడ్‌పైనే ఫోక‌స్ పెట్టింది. ఈ క్ర‌మంలో ఆమె చేసిన ట్వీట్ విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. దాంతో ఆమె అభిమానులు క‌న్ఫ్యూజ‌న్ అవుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

ర‌ష్మిక త‌న ట్వీట్‌లో ఇక‌పై పెద్ద ప‌నులు మాత్ర‌మే చేయ‌ల‌నుకుంటున్నాన‌ని, చిన్న ప‌నులకు దూరంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు స్పష్టం చేసింది. దీంతో ఆమె ఇక చిన్న హీరోల సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని అనుకుంటోంద‌ని కామెంట్లు వ‌స్తున్నాయి. ఇంకోవైపు బాలీవుడ్‌లో చిన్న హీరోల‌తో చేస్తోందని అందుకే ఆ సినిమాల‌కు బ్రేక్ వేయ‌నుంద‌ని అనుకుంటున్నారు. కాక‌పోతే దీనిపై ర‌ష్మిక‌నే క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది అస‌లు విష‌యం.

Read more RELATED
Recommended to you

Latest news