హుజురాబాద్ లోనే ఉంటా.. అభివృద్ధి చేసి చూపిస్తా : ఈటలకు గంగుల సవాల్

మంత్రి గంగుల కమలాకర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రోజు నుండి ఎలక్షన్స్ అయ్యే వరకు హుజురాబాద్ లోనే ఉంటానని కని, విని ఎరుగని విధంగా హుజురాబాద్ ను అభివృద్ధి చేసి చూపెడుతా అని ఈటలకు సవాల్ విసిరారు మంత్రి గంగుల. హుజురాబాద్ లో అభివృద్ధి జరగలేదు..రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయన్నారు. అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ వద్దకు వెళ్ళని ఈటల.. తన భూములు రెగ్యులర్ కోసం మాత్రమే సీఎం వద్దకు వెళ్ళాడని విమర్శలు చేశారు.

ఢిల్లిలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని.. ఫ్లైట్ లో వెళ్లి బీజేపీలో చేరిన ఈటలకు బీజేపీ అధ్యక్షులు కూడా టైం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఈరోజు గుడ్డి దీపంలా మారిందని..మన లక్ష సాధన కోసం మనం ఏర్పాటు చేసుకున్న పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. మోడీ పాలించిన గుజరాత్ లో కూడా ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదని గుర్తు చేశారు. మన నినాదం అభివృద్ధి నినాదమని.. గంగుల పేర్కొన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జెండా ఎగుర వేస్తామని స్పష్టం చేశారు.