రవితేజ ‘క్రాక్’ టీజర్ వచ్చేస్తోంది…..!!

-

మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ క్రాక్. రవితేజ ఒక మాస్ పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై బి మధు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా మంచి కమర్షియల్ యాంగిల్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టింది. ఇకపోతే నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. రవితేజ డార్క్ షాడో గా పరిగెత్తుకుంటూ వస్తున్న ఈ పోస్టర్ ఒక యాక్షన్ సీన్ కి సంబంధించిందని అర్ధం అవుతోంది. గతంలో రవితేజ, గోపీచంద్ ల కలయికలో వచ్చిన డాన్ శ్రీను ఫ్లాప్ అవ్వగా, బలుపు సినిమా సూపర్ హిట్ కొట్టింది.

అలానే ఈ సినిమా కూడా హిట్ కొట్టి, వారిద్దరి కాంబినేషన్లో మరొక విజయాన్ని నమోద చేయడం ఖాయం అని అంటున్నారు సినిమా యూనిట్ సభ్యులు. వేసవి కానుకగా మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. ఇటీవల వచ్చిన డిస్కో రాజా తో మరొక ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్న మాస్ రాజా, ఈ సినిమాతో అయినా ఎంత వరకు హిట్ అందుకుని ఫ్లాప్స్ కు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news