రవితేజ డిస్కోరాజా స్టోరీ లీక్ – ఇదే కథ ?

-

అప్పట్లో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ‘రాజా ది గ్రేట్’ సినిమా తో సూపర్ డూపర్ హిట్ రవితేజ కొట్టాడు. ఆ తరువాత చేసిన సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో రవితేజ కెరీర్ డైలమాలో పడిపోయింది. ఇటువంటి తరుణంలో విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించిన డిస్కో రాజా సినిమా త్వరలో విడుదల కానున్న ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటున్నాడు మాస్ మహారాజా రవితేజ.

Image result for disco raja

ఈ సందర్భంగా సినిమా కచ్చితంగా హిట్ అవడం గ్యారెంటీ అన్నట్టుగా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా అలరించటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఇదే., కథ ఇదే అన్న రీతిలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

మేటర్ లోకి వెళ్తే సినిమాలో స్టార్టింగ్ లో రవితేజ చాలా సీరియస్ మరియు ఎగ్రెసివ్ క్యారెక్టర్ లో ఉంటారు అని తర్వాత అనుకోని సంఘటన చోటు చేసుకోవడంతో కోమాలోకి వెళ్లిన రవితేజ తిరిగి మళ్లీ యధావిధి స్టేజ్ లోకి రావడం తో కోపంగా గా ఉండే క్యారెక్టర్ కాస్త కామెడీ క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా రవితేజ సినిమాలో నటిస్తాడని ఎంటర్టైనర్ చేస్తాడని కామెడీ పరంగా సినిమాలో విలన్ మరియు రవితేజ ల మధ్య వచ్చే  సన్నివేశాలు సినిమాకు హైలెట్ అని ఒక విధంగా చెప్పాలంటే ‘విక్రమార్కుడు’ సినిమా టైపులో దానికి మించి ‘డిస్కో రాజా’ సినిమా ఉంటుందని ఒక వార్త ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ ‘డిస్కోరాజా’ సినిమాతో ప్రేక్షకులను అల్లరిస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news