ర‌వితేజ ఈజ్ బ్యాక్‌?

-

వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కోరాజా ఆగిపోయింద‌నే వార్త‌లు వినిపించిన విష‌యం విదిత‌మే. ఆర్థిక కార‌ణాల‌తో బ్రేక్ ప‌డింద‌న్నారు. ఈ న్యూస్‌ని ఖండిస్తూ నిర్మాత రామ్ త‌ళ్ళూరి తాజా అప్‌డేట్ ఇచ్చారు.

ర‌వితేజ గ‌తేడాది చేసిన ట‌చ్ చేసి చూడు, నేల టికెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని హ్యాట్రిక్ ఫ్లాప్‌లుగా నిలిచాయి. ప‌రాజ‌యాలు వ‌చ్చినా ఆయ‌న జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ర‌వితేజ‌తో సినిమాలు చేసేందుకు చాలా మంది ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారు. ప్ర‌స్తుతం వి.ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా సినిమా చేస్తున్నారు. ఇది ప్రారంభ‌మై చాలా రోజుల‌వుతుంది. ఇటీవ‌ల ఆగిపోయింద‌నే వార్త‌లు వినిపించాయి.

మ‌రోవైపు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. దీనికి సంబంధించి అప్ డేట్ ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. కానీ ప్ర‌స్తుతం ముగ్గురు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్స్ ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు స్టోరీలు రెడీ చేశార‌ట‌. త‌నకు బెంగాల్ టైగ‌ర్ వంటి హిట్‌ని అందించిన సంప‌త్ నంది ఓ న్యూ జోన‌ర్ స్టోరీని ర‌వితే కోసం రెడీ చేసిన‌ట్టు తెలుస్తుంది.

దీంతోపాటు డాన్ శీను, బ‌లుపు సినిమాల‌ని రూపొందించిన గోపీచంద్ మ‌లినేని కూడా ఓ యాక్ష‌న్ త‌ర‌హా క‌థ‌తో సిద్ధంగా ఉన్నార‌నే వార్త సామాజిక మాద్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ అవుతుంది. ఇక గ‌తేడాది ఆర్ ఎక్స్ 100తో ఇండస్ట్రీ మొత్తం త‌న వైపు తిప్పుకున్న అజ‌య్ భూప‌తి సైతం మ‌రో పాత్ బ్రేకింగ్ స్టోరీని ర‌వితేజతో చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిసింది. మ‌రి ఈ ముగ్గురిలో ఎవ‌రికి మాస్ మ‌హారాజా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారు? ఒక‌వేళ ముగ్గురికీ ఓకే చెబితే ఎవ‌రి సినిమా ముందుంటుంది? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇదిలా ఉంటే వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కోరాజా ఆగిపోయింద‌నే వార్త‌లు వినిపించిన విష‌యం విదిత‌మే. ఆర్థిక కార‌ణాల‌తో బ్రేక్ ప‌డింద‌న్నారు. ఈ న్యూస్‌ని ఖండిస్తూ నిర్మాత రామ్ త‌ళ్ళూరి తాజా అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 27 నుంచి రెండో షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో జ‌రుప‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. మే 27 నుంచి జూన్ 21 వ‌ర‌కు జ‌రిగే షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు షూట్ చేయ‌నున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్ పుత్‌, న‌భా న‌టేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. మ‌రి ఈ చిత్రంతోనైనా ర‌వితేజ హిట్ కొట్టి మాస్ రాజా ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version