రజినీ ఫస్ట్‌ లుక్‌.. రవితేజ ఫస్ట్‌ సాంగ్‌.. రేపే

-

పండుగ వస్తోందంటే కొత్త మూవీస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తుంటాయి. రేపు వినాయక చవితి సందర్భంగా కూడా చాలా మూవీస్‌ తమ అప్‌డేట్స్‌తో రెడీగా ఉన్నాయి. రవితేజ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ఖిలాడి. రమేష్‌ వర్మ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ రేపు ఉదయం రిలీజ్‌ కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఇష్టం అనే పాటను శుక్రవారం ఉదయం పది గంటలకు రిలీజ్‌ చేస్తున్నారు.

‘సూపర్‌‌ స్టార్‌‌’ రజినీ కాంత్‌ నటిస్తున్న మూవీ ‘అన్నాత్తే’. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే దీపావళికి రిలీజ్‌ కానున్న ఈ చిత్రంలో రజినీ ఫస్ట్‌లుక్‌ రేపు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్‌ కానుండగా, మోషన్‌ పోస్టర్‌‌ సాయంత్రం ఆరు గంటలకు లాంఛ్‌ అవుతుంది. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న మూవీ ‘18 పేజెస్‌’. ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్‌2 పిక్చర్స్‌ బ్యానర్‌‌లో అల్లు అరవింద్‌, డైరెక్టర్‌‌ సుకుమార్‌‌ కలిపి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్‌ అనుపమ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌‌ లాంఛ్‌ కానుంది. రేపు సాయంత్రం ఈ పోస్టర్‌‌ను రిలీజ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news