సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో అభిమానుల గుండెల్ని పిండేసింది. త‌న అందంతో టాలీవుడ్‌లో సెగలు రేపిన రెజీనా అంటే టాలివుడ్ అభిమానుల‌కు ఎక్క‌డ లేని క్రేజ్ ఏర్ప‌డుతుంది.

బేసిక్‌గా చెన్నైకి చెందిన ఈ తమిళ అందాల భామ‌.. ఇటు తెలుగుతో పాటు కర్ణాట‌క‌, బాలివుడ్, కోలీవుడ్ సినిమాల్లో కూడా నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ మ‌ధ్య తెలుగు సినిమాల్లో క‌నిపించ‌డం త‌గ్గించేసింది. ఎక్కువ‌గా క‌న్న‌డ సినిమాల్లోనే చేస్తోంది.

అయితే ఈ భామ తెలుగు ఇండ‌స్ట్రీకి రావాల‌ని తెగ ట్రై చేస్తోంది. త్వ‌ర‌లోనే ఓ మీడియం స్టార్ హీరోతో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోందని స‌మాచారం. ఇదిలా ఉండ‌గా సోష‌ల్ మీడియాలో కూడా బాగానే ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ అందాల‌ను ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక రీసెంట్‌గా పోస్టు చేసిన సెగ‌లు రేపే ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.