నరేశ్, పవిత్ర లోకేశ్ మధ్య రిలేషన్ షిప్ రివీల్… వాళ్లు అన్నా..చెల్లెళ్లా?

టాలీవుడ్ సీనియర్ హీరో నరేశ్, ఆర్టిస్ట్ పవిత్ర లోకేశ్ మధ్య రిలేషన్ షిప్ పైన గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఇటీవల వారు మైసూరులోని ఓ హోటల్ లో కనిపించడంపైన సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. నరేశ్ భార్య రమ్య ఈ విషయమై నరేశ్ పై ఫైర్ అయింది. అయితే, రమ్య రఘుపతితో తాను ఎప్పుడో విడిపోయానని నరేశ్ చెప్పాడు. కానీ, తనను బెదిరించి విడాకులు తీసుకున్నాడని రమ్య ఆరోపించింది.

ఇక పవిత్ర లోకేశ్ ఇచ్చిన వివరణ కూడా అంతగా క్లారిటీ లేకుండాపోయింది. దాంతో సోషల్ మీడియాలో వీరిరువురు సహజీనవం చేస్తున్నారా? అనే కామెంట్స్ వచ్చాయి. అలా వీరు వార్తల్లో నిలిచారు. కాగా, తాజాగా మాస్ మహారాజ రవితేజ ‘రామారావు..ఆన్ డ్యూటీ’ సినిమాతో వీరు మళ్లీ చర్చనీయాంశమయ్యారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన పిక్చర్ తాజాగా విడుదల కాగా, అందులో పవిత్ర లోకేశ్, నరేశ్ నటించారట.

‘రామారావు..ఆన్ డ్యూటీ’ పిక్చర్ లో వీరిరువురు అన్నా..చెల్లెళ్లుగా కనిపించారట. థియేటర్ లో సినిమా చూస్తున్న క్రమంలో వీరిరువురిని చూసిన ప్రేక్షకులు ఈలలు కొడుతున్నారట. అదేంటీ? వీరి మధ్య అన్నా చెల్లెళ్ల రిలేషన్ షిప్ ఉందా? ఇదేంటని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు. ఇదే నిజమైన రిలేషన్ షిపా? అని చర్చించుకుంటున్నారు. చూడాలి మరి.. నరేశ్, పవిత్ర లోకేశ్ మధ్య రిలేషన్ షిప్ మళ్లీ ఎటు వైపునకు మలుపు తిరుగుతుందో…