శ్రావణి సూసైడ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్ లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు !

-

శ్రావణి సూసైడ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్ లో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. ప్రెస్ మీట్ లో A3 గా దేవ్ రాజ్ పేరు చెప్పిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం A1 గా దేవరాజ్ రెడ్డి, A2 గా సాయి కృష్ణ రెడ్డి, A3 గా అశోక్ రెడ్డి ని చేర్చారు. ఈ కేసులో 17 మంది సాక్షులను విచారించారు పోలీసులు. కుటుంబ సభ్యుల ముందు దేవ్ రాజ్ రెడ్డికి శ్రావణి ప్రపోజ్ చేసినట్టు గుర్తించారు. శ్రావణి కుటుంబసభ్యులు కూడా దేవ్ రాజ్ ను అడిగినా అతను ఒప్పుకోలేదు. అయినా సరే శ్రావణి దేవ్ రాజ్ ను ఒప్పించే ప్రయత్నం చేసింది. సాయి కృష్ణ, అశోక్ రెడ్డి లతో శ్రావణికి రిలేషన్ ఉండటంతో దేవ్ రాజ్ ఒప్పుకోలేదని అంటున్నారు. కానీ దేవ్ రాజ్ ను కలవడానికి శ్రావణి మెసెజ్ లు, ఫోన్ కాల్స్ తో ప్రయత్నించిందని అంటున్నారు.

సాయి కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డి శ్రావణి కుటుంబ సభ్యులు శ్రావణిని బెదిరించారని పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుంచి శ్రావణిని తీసుకెళ్లిన దేవరాజ్, పంజాగుట్ట శ్రీకన్య హోటల్ కి వెళ్ళాడు. ఎలా తెలిసిందో కానీ 9:30 కి శ్రీకన్య హోటల్ కు చేరుకున్న సాయి కృష్ణ రెడ్డి, శ్రావణి ని కొట్టి ఆటోలో తీసుకెళ్ళాడు. దేవ్ రాజ్ తో కలవకూడదని శ్రావణిని సాయి, అశోక్ రెడ్డిలు బెదిరించినట్టు గుర్తించారు. దేవ్ రాజ్ ను చంపేసి, ఆర్థికంగా ఆదుకోమని బెరించినట్టు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని దేవ్ రాజ్ ను కోరిన శ్రావణి, అయితే శ్రావణితో పారిపోయి పెళ్లిచేసుకోవడానికి దేవ్ రాజ్ ఒప్పుకోలేదని గుర్తించారు. దేవ్ రాజ్, సాయి కృష్ణ, అశోక్ రెడ్డి ల వేదింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. దేవ్ రాజ్, సాయి కృష్ణ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా A3 అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news