పవన్‌ కల్యాణ్‌కు మాజీ భార్య రేణు దేశాయ్‌ విషెస్‌

-

ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి అకీరా పంచెకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు. ఇన్‌స్టాలో అకీరా, ఆద్య ఫొటోలను షేర్ చేసిన రేణూ దేశాయ్‌ పవన్ ఈవెంట్ కోసం రెడీ అయిన తర్వాత తనకు వీడియో కాల్‌ చేసినట్లు చెప్పారు. ‘నా బిడ్డలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్‌ డేకు రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి చేయాలనుకొనే కల్యాణ్ గారికి శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవితో పాటు నాగబాబు, సాయి ధరమ్‌ తేజ్‌, రామ్‌ చరణ్‌, అకీరా, ఆద్య మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news