పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలి : RGV

-

సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విడుదల కాకున్నా.. ఆయన సినిమాలలో నటించకపోయిన సరే నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. సాధారణంగా తమ గురించి అందరూ మాట్లాడుకోవాలని ఆశించే వారు అధికంగా ఉంటారు కానీ అందుకోసం ఏం చేయాలో తెలియదు కానీ తెలివైన వారు మాత్రం ఏదో విధంగా తాము తరచు వార్తల్లో ఉండేలా చూసుకుంటారు.

అయితే, వాలంటీర్లను ఉద్దేశిస్తూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై దర్శకుడు RGV స్పందించారు. ‘ప్రజల కోసం పనిచేసే వాలంటీర్లను పవన్ అమ్మాయిల బ్రోకర్లు అన్నాడు. అంత నీచంగా, అసహ్యంగా వర్ణించబడ్డ వాలంటీర్లకు సిగ్గు, శరం, ఆత్మాభిమానం ఉంటే పవన్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి. YCP మహిళల ట్రాఫికింగ్ చేస్తుందనే పవన్ ఆరోపణలపై కేంద్రం వద్ద ఆధారాలు ఉంటే యాక్షన్ తీసుకోకుండా చెవిలో ఎందుకు చెప్పారు?’ అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news