ఒక కాకి చనిపోయిందంటే దాని చుట్టు వందల కాకులు చేరి అరుస్తుంటాయి. తమ మధ్యలో వున్న ఓ కాకి చనిపోయిందే అని బాధపడుతుంటాయి. కానీ మనుషుల్లో మాత్రం ఆ నీతి కొరవడుతోంది. ఒక మనిషి చనిపోతే వాడిపై ఇష్టమైన కోణంలో సినిమాలు తీయడం..ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం అనే విష సంస్కృతి పెచ్చరిల్లుతోంది. ఈ నీచ సంసృతికి సినీ రంగంలో ఆద్యుడుగా మారాడు రాబ్గోపాల్వర్మ.
ముంబై తాజ్ హోటల్ లో జరిగిన మారణ హోమం నేపథ్యంలో సినిమా చేసి బాగానే సొమ్ము చేసుకున్న వర్మ ఆ తరువాత సీమ ముఠా కక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్యోదంతం నేపథ్యంలో `రక్తచరిత్ర`ని తీశాడు. లాక్డౌన్ టైమ్‌లో కేవలం డబ్బులే పరమావధిగా వర్మ సీగ్రేడ్ చిత్రాల్ని వదిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు వర్మ కన్ను దిశ ఉదంతంపై పడింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచారం, హత్య ఆ తరువాత నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో `దిశ ఎన్ కౌంటర్`కు శ్రీకారం చుట్టాడు వర్మ.
దిశ సంఘటనని మక్కీటూ మక్కీ దించేస్తూ నట్టికుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని నిలిపివేయాలంటూ దిశ తండ్రి హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో `దిశ ఎన్కౌంటర్` వార్తల్లో నిలిచింది. ఒక అమ్మాయి తండ్రిగా నరకం అనుభవిస్తున్న దిశ తల్లిదండ్రులకు వర్మ `దిశ ఎన్కౌంటర్` రూపంలో మరింత నరకాన్ని చూపిస్తున్నాడు. దీంతో దిశ తండ్రి అతని ఇంటి ముందు ధర్నాకు దిగడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఎథిక్స్ లేని రామ్ గోపాల్‌వర్మ సంస్కార హీనుడని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికైనా వర్మ ఇలాంటి కథల్నితెరపైకి తీసుకురాకపోవడం మంచిదని చాలా మంది మండిపడుతున్నారు. ఎథిక్స్ పాటించడం సంస్కారం అవి లేని వాడు వర్మ అంటూ మండిపడుతున్నారు. ఒక అమ్మాయికి తండ్రిగా వర్మ మరో తండ్రి పడుతున్న నరకాన్ని తన డబ్బు దాహానికి పావుగా వాడుకోవడం నిజంగా సిగ్గు చేటే.