దుబాయ్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 26వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 158 పరుగులు చేసింది. మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లలో మనీష్ పాండే, కెప్టెన్ వార్నర్‌లు రాణించారు. 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసిన పాండే జట్టును ఆదుకున్నాడు. అలాగే డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. చివర్లో కేన్ విలియమ్సన్ 12 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులు చేయగా, గార్గ్ 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి, జయదేవ్ ఉనడ్కట్‌లు తలా ఒక వికెట్ తీశారు. మరొక వికెట్ రన్ అవుట్ రూపంలో లభించింది.
కాగా మ్యాచ్‌లో ఆరంభం నుంచి రాజస్థాన్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేశారు. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఎక్కడా కుదురుకోకుండా చేశారు. భారీ షాట్లు ఆడేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో హైదరాబాద్ తక్కువ స్కోరు చేయగలిగింది. అయితే వార్నర్, పాండేలు స్కోరు బోర్డును ముందుకు పరిగెత్తించారు. కానీ పిచ్ సహకరించకపోవడంతో భారీ షాట్లు ఆడేందుకు అవకాశం లేకపోయింది.