లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ & రేటింగ్

-

రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ అసలు కథగా వచ్చిన సినిమా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. సినిమా మొదలు పెట్టిన నాటి నుండి ఎన్నో వివాదాలు ఏర్పరచుకున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఎలా ఉంది ఆర్జివి ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఎన్.టి.ఆర్ బయోగ్రఫీ రాస్తానని చెప్పి లక్ష్మీ పార్వతి ఎన్.టి.ఆర్ దగ్గరకు వస్తుంది. ఆమె గురించి తెలుసుకున్న ఎన్.టి.ఆర్ తన బయోగ్రఫీ రాసేందుకు అనుమతి ఇస్తాడు. లక్ష్మీ పార్వతి ఆమె భర్త వీరగ్రంధం సుబ్బారావు ‘కళా కేంద్రం’ ఓపెనింగ్ కు ఎన్.టి.ఆర్ వెళ్తాడు. ఎన్.టి.ఆర్, లక్ష్మీ పార్వతి గురించి జనాలు తప్పుగా మాట్లాడుతున్నారని చంద్రబాబు చెబుతాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా ఈవెంట్ లో లక్ష్మీ పార్వతిని పెళ్లాడుతానని ప్రకటిస్తాడు ఎన్.టి.ఆర్. నందమూరి కుటుంబానికి, చంద్రబాబుకి ఈ నిర్ణయం నచ్చదు. ఓ న్యూస్ పేపర్ రావుతో కలిసి చంద్రబాబు లక్ష్మీ పార్వతి మీద నెగటివ్ వార్తలు రాయిస్తాడు. 1994లో ఎన్నికలు జరుగుతాయి వాటిలో ఎన్.టి.ఆర్ మళ్లీ విజయం సాధిస్తారు అయితే వైస్రాయ్ హోటెల్ ఘటనతో ఎన్.టి.ఆర్ ను గద్దె దించి బాబు గద్దెనెక్కుతాడు. ఫైనల్ గా ఎన్.టి.ఆర్ మరణించడంతో సినిమా ముగుస్తుంది.

ఎలా ఉందంటే :

ముందునుండి చెబుతున్నట్టుగా వర్మ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేశాడు. సినిమాలో కూడా సెకండ్ హాఫ్ మొత్తం అలానే బాబు వేసిన ఎత్తుగడలను.. ఎన్.టి.ఆర్ కు చేసిన అన్యాయాన్ని చూపించారు. బాబుని వ్యతిరేకించే ఎన్.టి.ఆర్ అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది.

సినిమా మొదటి భాగం మొత్తం ఎన్.టి.ఆర్, లక్ష్మి పార్వతి మధ్య డైలాగ్స్ తో ఎక్కువ నడిపించాడు. అవి కాస్త బోర్ గా అనిపిస్తాయి. అయితే సెకండ్ హాఫ్ బాగుందనిపిస్తుంది. వెన్నుపోటు ఎపిసోడ్ క్యూరియాసిటీని కలుగచేస్తుంది. అయితే చివరి 30 నిమిషాలు కూడా ఓవర్ డోస్ సెంటిమెంట్ తో మళ్లీ బోర్ కొట్టిస్తాయి.
అయితే సినిమాతో దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చెప్పదలంచుకున్నాడో ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ ముందు ఏర్పడిన బజ్.. పెట్టిన బడ్జెట్ తక్కువే కాబట్టి సినిమా సేఫ్ జోన్ లో ఉన్నట్టే.



ఎలా చేశారు :

ఎన్.టి.ఆర్ గా నటించిన విజయ్ కుమార్ పర్వాలేదు అనిపించాడు. అయితే సిల్వర్ స్క్రీన్ పై ఎన్.టి.ఆర్ కు అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. పక్కాగా చెప్పాలంటే ఎన్.టి.ఆర్ డూప్ గా ఉన్నాడని చెప్పొచ్చు. లక్ష్మీ పార్వతిగా చేసిన కన్నడ నటి యగ్నా శెట్టి ఆమె పాత్రకు న్యాయం చేసింది. ఎన్.టి.ఆర్, లక్ష్మీ పార్వతి సీన్స్ బాగా వచ్చాయి. అయితే డైలాగ్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. చంద్రబాబుగా శ్రీ తేజ్ బాగా చేశాడు.

టెక్నికల్ టీం గురించి చెబితే రమ్మీ సినిమాటోగ్రఫీ బాగుంది. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ఆర్జివి స్టోరీ, స్క్రీన్ ప్లే మొదటి భాగం బోర్ కొట్టించేయగా సెకండ్ హాఫ్ లో ముఖ్య సన్నివేశాలు బాగా తీశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

చంద్రబాబు పాత్ర

సెకండ్ హాఫ్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

క్లైమాక్స్

మ్యూజిక్

బాటం లైన్ :

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.. టార్గెట్ రీచ్ అయినట్టే..!

రేటింగ్ : 3.0/5

Read more RELATED
Recommended to you

Exit mobile version